తమిళ రీమేక్ లో నటించబోతున్న రవితేజ !

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు తమిళంలో మంచి విజయం సాధించిన ‘తెరి’ సినిమాను సంతోష్ శ్రీనివాస్ రవితేజతో రీమేక్ చెయ్యబోతున్నాడు. తమిళ ‘తెరి’ సినిమాలో విజయ్ హీరోగా నటించడం జరిగింది.

ప్రస్తుతం రవితేజ ‘నేలటికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. మే లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ తరువాత శ్రీనువైట్లతో సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. సంతోష్ శ్రీనివాస్ సినిమాను త్వరలో నిర్మాతలు అధికారికంగా ప్రకటించబోతున్నారు. కీర్తి సురేష్, క్యాథరిన్ ఈ మూవీలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.