మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత రవితేజ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఒక మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. నిజానికి వివేక్ ఆత్రేయ ఈ కథను బాలకృష్ణ కోసం సిద్ధం చేసి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా పొందాడు. అయితే బాలయ్య ప్రస్తుతం ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్‌లో వివేక్ ఆత్రేయ రవితేజను సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చెప్పాడు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
దీంతో పాటు హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయనున్నాడు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విశేషం ఏమిటంటే, వివేక్ ఆత్రేయ మరియు హసిత్ గోలి సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరగనున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు రానున్నాయి. తన స్పీడును పెంచుతూ రవితేజ బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.


