50 కోట్ల క్లబ్ లోకి మాస్ మహారాజ “ఈగిల్”

50 కోట్ల క్లబ్ లోకి మాస్ మహారాజ “ఈగిల్”

Published on Feb 19, 2024 12:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రీసెంట్ గా ఈగిల్ మూవీ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం రెండో వారాంతం ముగిసే సమయానికి 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 51.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

సినిమాకి తొలి షో నుండి పాజిటివ్ టాక్ రావడం తో మంచి వసూళ్లు వస్తున్నాయి. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు