షూటింగ్ చివరి దశలో ‘నేల టికెట్టు’ !

షూటింగ్ చివరి దశలో ‘నేల టికెట్టు’ !

Published on May 8, 2018 6:04 PM IST

హీరో రవి తేజ చేస్తున్న చిత్రం ‘నేల టికెట్టు’ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. నిన్ననే రవితేజ తన తాలూకు షూటింగ్ ముగించగా హీరోయిన్ మాళవిక శర్మ కూడ ఈరోజుటితో తన షూటింగ్ పూర్తిచేయనుంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడ మొదలుపెట్టింది. ‘టచ్ చేసి చూడు’ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది.

‘సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ‘ఫిదా’ ఫేమ్ శక్తి కాంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే రేపు జరగనున్న ఈ చిత్ర ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు