ఫుల్ లెంగ్త్ ఎంటెర్టైనర్ లో మాస్ మహారాజా !

Published on Mar 7, 2020 12:03 am IST

ఇటీవలే ‘డిస్కోరాజా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన మాస్ మహారాజా రవితేజ తన తర్వాతి చిత్రాన్ని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజతో ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మ ఇటీవలే ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకున్నారు. రవితేజతో ఆయన చేయనున్న కొత్త చిత్రానికి కూడా మంచి కథను ఎంచుకున్నారట ఆయన. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలిసి నటించిన, ఇంకా విడుదలకాని ‘శతురంగ వెట్టై 2’ చిత్రం యొక్క స్టోరీ లైన్ ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దుతున్నారట.

కాగా కథ ఫుల్ లెంగ్త్ ఎంటెర్టైనర్ లా ఉండేలా రాసుకుంటున్నారట రమేష్ వర్మ. ముఖ్యంగా కిక్ సినిమలో లాగా రవితేజ క్యారెక్టరైజేషన్ చాల బాగుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ఆరంభంకానుంది. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More