“వెంకీ” @20 ఇయర్స్.. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్

“వెంకీ” @20 ఇయర్స్.. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్

Published on Mar 26, 2024 10:07 AM IST


టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న పలు క్లాసిక్ ఎంటర్టైనర్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా స్నేహ హీరోయిన్ గా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం “వెంకీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నేటితో 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం విశేషం. మరి ఇప్పటికీ మీమ్స్ రూపేణా ప్రతి రోజు కనిపించే ఈ చిత్రం విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో రవితేజ సరసన స్నేహ సాలిడ్ కెమిస్ట్రీ కనబరిచింది. వారిద్దరి నడుమ ఎనర్జిటిక్ సాంగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ సూపర్బ్ గా పండాయి. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటి ఛాయిస్ స్నేహ కాదట. అప్పటికే కోలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ అసిన్ ని ఈ సినిమాలో రవితేజ సరసన అనుకున్నారట.

కానీ కొన్ని కారణాలు రీత్యా ఆమె ప్లేస్ లో స్నేహ వచ్చారు. అయినా కూడా తమ కాంబినేషన్ ఎలాంటి ఫేమ్ ని తెచ్చుకుందో తెలిసిందే. మరి ఈ ఐకానిక్ ఎంటర్టైనర్ లో వేణు మాధవ్, బ్రహ్మానందం, ఏవీఎస్ లాంటి దిగ్గజ హాస్య నటులు నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే రీసెంట్ గానే ఈ చిత్రం రీ రిలీజ్ కి రాగా సెన్సేషనల్ రెస్పాన్స్ ని కూడా అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు