మాస్ మహారాజా రవితేజ మేనల్లుడు మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మారెమ్మ’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం రూరల్ యాక్షన్ డ్రామా అంశాలతో ఆసక్తికరంగా సాగింది.
ఊరి పవిత్రమైన దున్నపోతు అకస్మాత్తుగా మాయమవ్వడం, దాని చుట్టూ అల్లుకున్న రహస్యాలు మరియు గ్రామీణ దేవత మారెమ్మ తల్లి పట్ల ఊరి ప్రజల నమ్మకాల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మాధవ్ తన ఎనర్జెటిక్ మాస్ అవతార్‌తో సీన్లలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చాటాడు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవ్‌కు జోడీగా దీపా బాలు నటించగా, వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ప్రశాంత్ ఆర్ విహారి అందించిన రా అండ్ సీరియస్ బీజీఎం, ప్రశాంత్ అంకిరెడ్డి విజువల్స్ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. సంప్రదాయ నమ్మకాలు, పగ, యాక్షన్ అంశాలతో వస్తున్న ఈ ‘మారెమ్మ’ మాస్ అండ్ రూరల్ సినిమా ప్రేమికులకు థియేటర్లలో పక్కా వినోదాన్ని అందిస్తుందనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


