RC 16 : దానికి మించే ఉంటుందట ?

RC 16 : దానికి మించే ఉంటుందట ?

Published on Jan 25, 2024 2:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో అతి త్వరలో RC 16 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సతీష్ కిలారు నిర్మాతగా వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

మ్యాటర్ ఏమిటంటే, గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీలో చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. అయితే ఆ పాత్రని మించేలా మరింత యాక్షన్, ఎమోషనల్ అంశాలు కలగలిపి దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీలో రామ్ చరణ్ పాత్రని మాస్ స్టైల్ లో అద్భుతంగా రాసుకున్నారని, అలానే మూవీని కూడా గ్రాండియర్ గా తెరకెక్కించనున్నట్లు టాక్. అతి త్వరలో ఈ మూవీ గురించిన అప్ డేట్స్ వరుసగా ఒక్కొక్కటిగా రానున్నాయి. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీతో రామ్ చరణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు