RC 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ ?

RC 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ ?

Published on Mar 3, 2024 1:00 AM IST

తాజాగా దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీని అనంతరం బుచ్చి బాబు సనతో ఒక భారీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ రూరల్ డ్రామా మూవీ చేయనున్నారు చరణ్.

ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీని వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, కొద్దిరోజులుగా ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ అద్వర్యంలో దర్శకుడు బుచ్చి బాబు సన మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారట. ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ఈ సిట్టింగ్స్ లో కేవలం మూవీ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈమూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు