RC 17 : చరణ్ ఫ్యాన్స్ కి మ్యూజికల్ అప్ డేట్ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు సన

RC 17 : చరణ్ ఫ్యాన్స్ కి మ్యూజికల్ అప్ డేట్ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు సన

Published on Mar 28, 2024 3:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక దీనితో పాటు తదుపరి మరొక రెండు సినిమాలు కూడా చరణ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో బుచ్చి బాబు సన తెరకెక్కించనున్న RC 16 మూవీ కూడా ఒకటి. వెంకట సతీష్ కిలారు ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.

నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సన మాట్లాడుతూ, ఉప్పెన తరువాత రామ్ చరణ్ గారు నేను చెప్పిన కథని నమ్మి నాకు అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా అందరి అంచనాలు మించేలా RC 16 మూవీ ఉంటుందని అన్నారు. ఇక మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ గారు ఇప్పటికే మూడు సూపర్ ట్యూన్స్ ని అందించారని, ఫస్ట్ సాంగ్ నుండే మీలో ఫుల్ జోష్ వస్తుందని, ఉప్పెన మాదిరిగా ఇది కూడా మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని తెలిపారు బుచ్చిబాబు సన

సంబంధిత సమాచారం

తాజా వార్తలు