గ్లామరస్ రోల్స్ కి రెడీ అంటున్న రెజీన

Regina
‘కొత్త జంట’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రెజీన కసాండ్ర. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కి అటు విమర్శకుల నుండి, ఇటు ప్రేక్షకుల నుండి మన్ననలు అందుకుంది. దాంతో ప్రస్తుతం రెజీనకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పటి వరకూ రెజీన గ్లామరస్ రోల్స్ ఏమీ చేయలేదు అలాగే ఓ డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవుతూ స్కిన్ షో కి దూరంగా ఉంటోంది. మీరు గ్లామరస్ రోల్ చేయరా అనే ప్రశ్నని ఆమె ముందు ఉంచితే ‘నాకు మామూలుగా షార్ట్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ హీరోయిన్ అయ్యాక ఇది చెయ్యను అది చెయ్యను అందం కరెక్ట్ కాదు. స్కిన్ షో లిప్ లాక్స్ ఇప్పటి సినిమాల్లో సాధారనమైపోయాయి. నేను కూడా స్కిన్ షో, లిప్ లాక్స్ చేయడానికి రెడీ. కానీ అవి చేయాలంటే కథ డిమాండ్ చేయాలి, అలాగే డైరెక్టర్ అవి ఎంత కీలకమో డైరెక్టర్ వివరిస్తేనే చేస్తానని’ సమాధానం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.

రెజీన కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. మొదట్లోనే ఇలా ఓపెన్ మైండ్ తో అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల రెజీన సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్?

Exit mobile version