సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి తాజా చిత్రం ‘పెటా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘జిగర్తాండ’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నఈ మాస్ ఎంటర్టైనర్లో విజయ్ సేతుపతి , బాబీ సింహ, సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా తమిళ్ తోపాటు తెలుగులోను విడుదలకానుంది. ఇక ఇంతకుముందు ‘నవాబ్ , సర్కార్ ‘చిత్రాల తెలుగు హక్కులను సొంతం చేసుకున్న అశోక్ వల్లభనేని ఈ పేట తెలుగు హక్కులను దక్కించుకున్నాడు.
