ఇవ్వడంలో వున్న ఆనందం తెలిసింది : మహేష్ బాబు

Mahesh-srimantudu
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఈ ఆగష్టు 7న విడుదలకు సిద్ధపడుతుంది. మహేష్ బాబు తన డబ్బింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు మహేష్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం.

తాజాగా ఒక ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ మనం సమాజానికి తిరిగి ఏమిచ్చాం అన్న నేపధ్యంలో తీసిన సినిమా ఇదని, ఈ కధ నాకు దాతృత్వంలో వున్న గొప్పదనాన్ని తెలిపిందని చెప్పుకొచ్చాడు. ఈ కధనే కమర్షియల్ సినిమా విధంగా తెరకెక్కించామని తెలిపాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలకానుంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది.

Exit mobile version