శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్.. చిరు అందుకే కనిపించడం లేదా..?

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రానుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి అన్నీ తానై చూసుకుంటున్నాడు. అయితే, ఈ ప్రమోషన్స్‌లో ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఈ ప్రమోషన్స్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారా..? అనే విషయం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఆయన ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నారని.. డాక్టర్లు ఆయన్ను ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

గతకొద్ది కాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న చిరంజీవి ఈ చిత్ర షూటింగ్ ముగియడంతో వెంటనే సర్జరీ చేయించుకున్నట్లు చిత్ర వర్గాల టాక్. ఈ లెక్కన ఆయన మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్స్, రిలీజ్ సమయంలో ఆయన కనిపించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి నిజంగానే చిరు, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించరా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version