బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం NBK111 ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఎంతో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ విషయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.

గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల 2026కి వాయిదా పడింది. ప్రస్తుతం నయనతార ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో, బాలయ్య సినిమాకు కాల్షీట్లు కేటాయించలేకపోయింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్‌ను సంప్రదించింది. కథ నచ్చడంతో కాజల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, నయనతారతో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్‌కే అంగీకరించినట్లు సమాచారం. ఇటీవల కాజల్‌పై ఫోటోషూట్ కూడా నిర్వహించి, ఆమెను ఫైనలైజ్ చేశారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే సినిమా షూటింగ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

Exit mobile version