హిమాయత్ సాగర్లో షూటింగ్ జరుపుకున్న రెబల్

హిమాయత్ సాగర్లో షూటింగ్ జరుపుకున్న రెబల్

Published on Nov 29, 2011 10:22 AM IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రెబల్’. ఈ చిత్రం గత రెండు రోజులుగా హిమాయత్ సాగర్లోని గెస్ట్ హౌసులో షూటింగ్ జరుపుకుంది. ఇక్కడ కృష్ణం రాజు పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిచారు. రెబల్ చిత్రంలో కృష్ణం రాజు ప్రభాస్ కు తండ్రిగా కనిపించబోతున్నారు. ప్రభాస్ కు జోడీగా తమన్నా మరియు దీక్షా సేథ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ డిసెంబరులో రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెబల్ చిత్రాన్ని పుల్లా రావు నిర్మిస్తుండగా లారెన్స్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు