సాయి తేజ్ “రిపబ్లిక్” టీజర్ కు రికార్డ్ లెవెల్ రెస్పాన్స్.!

సాయి తేజ్ “రిపబ్లిక్” టీజర్ కు రికార్డ్ లెవెల్ రెస్పాన్స్.!

Published on Apr 7, 2021 12:36 AM IST

REPUBLIC

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. తన లాస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”తో హ్యాట్రిక్ కొట్టిన సాయి తేజ్ ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టతో “రిపబ్లిక్” అనే స్ట్రాంగ్ సబ్జెక్టుతో వస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఇటీవలే వచ్చిన టీజర్ కు టైర్ 2 లో ఏ హీరో సినిమాకు కూడా రాని స్థాయి రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది.

24 గంటల్లో 8.1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను ఇది లాక్ చేసింది. దీనితో ఈ ఆల్ టైం రికార్డ్ సాయి తేజ్ కు చేరింది. పెద్దగా హైప్ క్రియేట్ చెయ్యకుండానే నార్మల్ గానే వచ్చి మంచి రెస్పాన్ ను ఈ టీజర్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య కృష్ణ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే జూన్ 4 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు