
ఒక కాంబినేషన్ లో హిట్ సినిమా, మళ్ళీ అదే కాంబినేషన్ లో ఇంకొంతమంది స్టార్స్ యాడ్ అయ్యి దానికి సీక్వెల్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా..? 2009లో వచ్చిన ‘కిక్’ సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న మాస్ మహారాజ్ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కిక్ 2’. సీక్వెల్ లా ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్ కి ముడి పెట్టినా ఆ సినిమాకి పూర్తి డిఫరెంట్ గా ఉండే కథతో వచ్చిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో నెలకొన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
అంతే కాకుండా రిలీజ్ ముందే వస్తున్న క్రేజ్ చూసి కిక్ 2 సినిమాకి మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుందని తెలియజేస్తుందని తెలిపాము. చెప్పినట్టుగానే ‘కిక్ 2’ సినిమాకి మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఈ రోజు మార్నింగ్ షౌస్ కి వచ్చిన క్రేజ్ మరియు కలెక్షన్స్ ప్రకారం మొదటి రోజు రవితేజ కెరీర్లోనే అత్యధిక షేర్ మార్క్ కలెక్ట్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. సుమారు మొదటి రోజు వర్ల్ వైడ్ గా 6-8 కోట్ల షేర్ మార్క్ రావచ్చని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. రవితేజ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం. ‘కిక్’ సినిమా పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా కావడం వలన ఈ సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తున్నాయని సమాచారం.
రవితేజకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. బ్రహ్మానందం, రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రా లాంటి కమెడియన్స్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.