రెజినా ప్రస్తుత యువ హీరోయిన్లలో ఒక సంచలమనే చెప్పాలి. కెరీర్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ భామ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన ‘పవర్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో తానొక ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు తెలిపింది
ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర సరసన రెజినా మెరవనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హన్సిక ప్రధాన నాయిక
పవర్ సినిమా ఈ శుక్రవారం మనముందుకు రానుంది. బాబీ దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాకు నిర్మాత


