తాను నటించిన పవర్ సినిమా మంచి విజయం సాధించడంతో యువ కధానాయిక రెజినా అందరికీ ధన్యవాదాలు తెలిపే పనిలో పడింది. ఈ సందర్భంలో రవితేజ గురించి మాట్లాడుతూ అతను చాలా ప్రొఫెషనల్ అని, సెట్ లో ఎవరితో అన్నా ఇట్టే కలిసిపోతాడని, అతనుంటే షూటింగ్ లా కాక పండుగలా వుంటుందని చెప్పుకొచ్చింది.
పవర్ సినిమా విజయంతో రెజినా అగ్రతారల జాబితాలోకి టిక్కెట్ సంపాదించుకుంది. గతంలో రెజినా ‘ఎస్.ఎం.ఎస్’, ‘కొత్తజంట’, ‘ రారా కృష్ణయ్య’ వంటి సినిమాలలో నటించింది


