రాజమౌళిని టెన్షన్ పెడుతున్న “ఆర్ ఆర్ ఆర్”

Published on May 29, 2019 11:11 am IST

దర్శకధీరుడు రాజమౌళి ఏ పనిచేసినా పక్కా ప్రణాళికతో ముందుకు వెళతారు. తన సినిమాల ఘన విజయం వెనుక అసలు కారణం కూడా ఇదే. ఐతే ప్రస్తుతం రాజమౌళి తారక్, చరణ్ లతో చేస్తున్నభారీ మల్టీస్టారర్ “ఆర్ ఆర్ ఆర్” ఆయనను టెన్షన్ పెడుతుంది. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఆయన కొంత అసహనానికి గురవుతున్నారంట.

కొన్ని రోజుల క్రితం ఉత్తర భారత దేశంలో ప్లాన్ చేసిన షెడ్యూలు చిత్రీకరణ సమయంలో చరణ్,తారక్ ఇద్దరు గాయాలపాలు కావడంతో ఆ షెడ్యూలు చిత్రీకరణ పూర్తి కాకుండానే తిరిగిరావలసివచ్చింది. దానితో పాటు నెల రోజుల విరామం చిత్రీకరణ ఆలస్యానికి దారితీసింది. దీనితో అనుకున్న సమయానికి మూవీ పూర్తి చేసి విడుదల చేయగలమా లేదా అనే టెన్షన్ పట్టుకుందంట రాజమౌళికి.

ఈ పరిస్థితులలో తారక్, చరణ్ లను నిరవధికంగా షూటింగ్ లో పాల్గొనాలని ఆదేశించాడంట రాజమౌళి. ఎలాగైనా ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పార్ట్ పూర్తి చేసి, ప్రకటించిన విధంగా జులై 30,2020 కల్లా థియేటర్లలోకి “ఆర్ ఆర్ ఆర్” ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడంట.

సంబంధిత సమాచారం :

More