అఫీషియల్ : ఆశిష్, వైష్ణవి చైతన్య లవ్, హారర్ డ్రామా రిలీజ్ డేట్ ఖరారు

అఫీషియల్ : ఆశిష్, వైష్ణవి చైతన్య లవ్, హారర్ డ్రామా రిలీజ్ డేట్ ఖరారు

Published on Mar 24, 2024 1:05 PM IST


యువ నటీనటులు ఆశిష్ రెడ్డి అలాగే “బేబి” సెన్సేషన్ వైష్ణవి చైతన్య కలయికలో చేస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం “లవ్ మి” కోసం తెలిసిందే. పోస్టర్ మరియు టీజర్ లతో మంచి ఆసక్తిని రేపిన ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇది వరకే బజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది.

దీనితో ఈ సాలిడ్ లవ్ హారర్ థ్రిల్లర్ ని ఈ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ తో రివీల్ చేశారు. ఇక ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తుండగా తాను ఈ చిత్రం తోనే టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి అలాగే నాగ మల్లిడి నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ట్రీట్ ని ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు