డిసెంబర్ 6న వస్తున్న ‘కలియుగ’..!

డిసెంబర్ 6న వస్తున్న ‘కలియుగ’..!

Published on Nov 30, 2019 5:09 PM IST

kaliyuga

రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై, నటుడు సూర్య నిర్మించిన సినిమా ‘కలియుగ’. వచ్చే నెల 6న మూవీ విడుదల నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నేడు గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ…కలియుగ సినిమాలో యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న రవీందర్ గారికి, శాస్త్రి గారికి థాంక్స్. అలాగే నన్ను వెనక ఉండి నడిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి ధన్యవాదాలు. 24 శాఖల వారు నన్ను సపోర్ట్ చేశారు. సామాన్య ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా కలియుగ. సినిమా మీ అందరికి నచ్చుతుందని, తప్పకుండా సినిమా థియేటర్ లో చూడమని తెలిపారు.

హీరో రాజ్ మాట్లాడుతూ..ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని సపోర్టు చేస్తున్న మీ అందరికి థాంక్స్. సూర్య భవిషత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని చెయ్యాలి. విశ్వ, శాంతి బాగా నటించారు. డైరెక్టర్ గోపి గణేష్ గారి సహకారం మరువలేనిది. డైరెక్టర్ తిరుపతి గారు సినిమాను బాగా తీసాడు అన్నారు.

తాజా వార్తలు