లేటెస్ట్..నాగశౌర్య “కృష్ణ వ్రింద విహారి” రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Apr 23, 2022 5:06 pm IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ డెడికేటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “కృష్ణ వ్రింద విహారి” కూడా ఒకటి. నటి షిర్లే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి బజ్ నెలకొల్పుకొని ఒక్కో అప్డేట్ తో ఇప్పటి వరకు అలరించింది.

మరి లేటెస్ట్ గా ఇప్పుడు ఈ సినిమా ఎపుడు థియేటర్స్ లో అలరిస్తుందో మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ వచ్చే మే 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందివ్వగా ఐరా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. మరి ఈ చిత్రంతో నాగ శౌర్య మళ్ళీ తన కెరీర్ లో ఒక క్లీన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :