మార్చి 27న ‘గేమ్ చేంజర్’ విడుదల తేదీ ?

మార్చి 27న ‘గేమ్ చేంజర్’ విడుదల తేదీ ?

Published on Feb 26, 2024 6:37 PM IST

బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం “గేమ్ చేంజర్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ డ్రామాకి సంబంధించిన అప్‌ డేట్‌ ల కోసం ‘రామ్ చరణ్’ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న రూమర్ల ప్రకారం నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

కాగా, కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు