డిసెంబర్ లో రానున్న నాగ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’

soggade_chinni_nayan-(1)
‘మనం’ సినిమా తర్వాత కింగ్ నాగార్జున మరోసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఆగష్టు 29న నాగార్జున బర్త్ డే కానుకగా ఆగష్టు 29న రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ‘ఆత్మ’ల కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా ఆధ్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి నాగార్జున మరియు అతని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర టీం డిసెంబర్ లో సరైన రిలీజ్ డేట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

నాగార్జున కెరీర్లో చాలా హిట్ సినిమాలు అదే నెలలో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. కావున ఈ సెంటిమెంట్ కూడా నాగార్జునకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుందని నాగార్జున భావిస్తున్నాడు. అంతే కాకుండా నాగర్జున తనయుడు అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అఖిల్’ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుండడం, నవంబర్ లో నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ కానుండడంతో నాగార్జున డిసెంబర్ కి వెళ్ళాడని సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

Exit mobile version