
తన సినిమాలతో సౌత్ ఇండియానేకాక యావత్ భారతదేశాన్ని తన దృష్టివైపుకి తిప్పుకోగల ఘనత శంకర్ కి మాత్రమే చెల్లింది. శంకర్ విక్రమ్ ల కాంబినేషన్ గా వస్తున్న అగ్లీ ట్రూత్ ‘ఐ’ పలు వాయిదాల తరువాత సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. కానీ తాజాగా ఈ సినిమాకి ఓ సమస్య వచ్చి పడింది.. దానివల్ల సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానం అందరిలోనూ మొదలైంది.
అయితే ఆ సమస్య కేవలం చిన్న ఫైనాన్షియల్ సెటిల్మెంట్ మాత్రమేనని దానిని నిర్మాత ఈరోజు తీర్చనున్నారని సినిమా చెప్పిన సమయానికి విడుదలచేసి తీరతామని కోలీవుడ్ నుండి సందేశాలు వినబడుతున్నాయి. ఈ వార్త శంకర్, విక్రమ్ అభిమానులను సంతృప్తిపరుస్తుంది. విక్రమ్, అమీజాక్సన్ లు జంటగా నటించిన ఈ సినిమాకి ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత.