ప్రభాస్ “స్పిరిట్” రిలీజ్ టైం లాక్.!

ప్రభాస్ “స్పిరిట్” రిలీజ్ టైం లాక్.!

Published on Nov 29, 2023 9:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటించిన అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండగా ఫ్యాన్స్ కి కూడా కావాల్సినంత హైప్ ని మేకర్స్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్ లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఉన్న “స్పిరిట్” పై కూడా సాలిడ్ హైప్ నెలకొనగా ఈ చిత్రంపై పలు ఆసక్తికర వార్తలు బయటకి వచ్చాయి.

మరి వాటిలో ఆల్రెడీ దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఇక దీనితో పాటుగా ఇప్పుడు అదనంగా మరింత సాలిడ్ ఇన్ఫో బయటకి వచ్చింది. దీనితో ఈ సినిమాని తాము 2025 క్రిస్మస్ రేస్ లో లేదా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం అయితే అప్పటివరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు