రీమేక్ సినీమాల్లో నటించడం ఇష్టం లేదు – విద్యాబాలన్ !

రీమేక్ సినీమాల్లో నటించడం ఇష్టం లేదు – విద్యాబాలన్ !

Published on Jan 19, 2019 2:00 AM IST

కథాబలం వున్నా పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ ఫై కూడా ద్రుష్టి సారించింది ఈ నటి. అందులో భాగంగా బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది. ఇక ఈ చిత్రం తో పాటుతల అజిత్ నటించనున్న పింక్ రీమేక్ లో కూడా నటించనుంది.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో విద్యా మాట్లాడుతూ రీమేక్ సినీమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదని కానీ బోనీ కపూర్ జీ పింక రీమేక్ లో అదితి పాత్రలో నటిస్తావా అని అడిగేసరికి కాదనలేకపోయానని ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె అన్నారు.

ఖాకి ఫేమ్ వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా విద్యా బాలన్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు