
రేణు దేశాయ్ నిర్మిస్తున్న మరాటి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా తెలుగు బాషలో సైతం విడుదలకానున్న విషయం తెలిసినదే.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 17న మనముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్తనటీనటులతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను రేణు ట్విట్టర్ లో విరివిగా ప్రచారం సాగిస్తుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం