
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలీవుడ్ న్యూ డ్రీమ్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘బ్రూస్ లీ’. యాక్షన్ కి కామెడీని బాగా దట్టించి తీయగల శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో గత మూడు రోజులుగా ‘మెగా మీటర్’ సాంగ్ ని షూట్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం. అంతే కాకుండా, రిలీజ్ కి తక్కువ సమయం ఉండడంతో ఈ సాంగ్ కోసం రామ్ చరణ్ సుమారు 17 గంటలు పని చేస్తున్నాడని కూడా తెలియజేశాం.
ఈ సాంగ్ షూట్ ని శరవేగంగా ఫినిష్ చేసి మిగిలిన షూట్ పార్ట్ ని కూడా పూర్త చేయాలని రామ్ చరణ్ స్స్లు రెస్ట్ తీసుకోవడంలేదు. నిన్న రాత్రి 3 గంటల వరకూ షూట్ లో పాల్గొన్న రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ లు ఈ రోజు ఉదయం 10 గంటలకే మళ్ళీ సెట్లో సాంగ్ షూట్ ని మొదలు పెట్టారు. ఈ రోజు రాత్రి వరకూ కంటిన్యూగా షూట్ చేసి ఈ సాంగ్ షూట్ ని ఫినిష్ చేయనున్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ కాస్త అలసటగా ఉన్నా మేము చేస్తున్న మాస్ బీట్ సాంగ్ వల్ల అది తెలియడంలేదని తెలిపింది. నేటితో ఈ సాంగ్ షూట్ ని ఫినిష్ చేసి రేపటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై షూట్ చేయబోయే పార్ట్ ని షూట్ చేయనున్నారు.
రామ్ చరణ్ అండ్ టీం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైం ప్రకారం అక్టోబర్ 16న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. డివివి దానయ్య నిర్మాత.

