ఓటిటిలో “నా సామిరంగ” కి రెస్పాన్స్ రివర్స్.. కానీ

ఓటిటిలో “నా సామిరంగ” కి రెస్పాన్స్ రివర్స్.. కానీ

Published on Feb 18, 2024 9:04 PM IST


టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన సంక్రాంతి సూపర్ హిట్ చిత్రం “నా సామిరంగ”. మరి ఈ ఏడాది సంక్రాంతి రేస్ లో వచ్చి నాగార్జున కెరీర్ లో మరో పండుగ హిట్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం థియేటర్స్ లో ఉన్న కొన్ని రోజుల్లోనే మంచి వసూళ్లు రాబట్టేసి లాభాలు కొట్టేసింది.

అయితే ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో రిలీజ్ అయ్యాక చాలా మంది థియేటర్స్ లో మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూసాక సోషల్ మీడియాలో తమ రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం దాదాపు రెస్పాన్స్ రివర్స్ లో ఉందని చెప్పాలి. ఆల్మోస్ట్ నెటిజన్స్ ఈ సినిమా వారికి అంతగా రుచించలేదనే చెబుతున్నారు.

కానీ దీనికి మాత్రం ఈ రేంజ్ టాక్ తో కూడా నాగార్జున సంక్రాంతి బరిలో హిట్ కొట్టి లాభాలు అందించాడు అంటే అది నాగ్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న స్టామినానే అని అంటున్నారు. మొత్తానికి అయితే ఓటిటిలో వచ్చాక నా సామిరంగ పరిస్థితి ఇలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు