‘రామ్ గోపాల్ వర్మ’ తన తర్వాత సినిమాను ఎనౌన్స్ చేశాడు !

‘రామ్ గోపాల్ వర్మ’ తన తర్వాత సినిమాను ఎనౌన్స్ చేశాడు !

Published on Jun 10, 2018 5:08 PM IST


ఆఫీసర్ లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన వర్మ, ఎట్టకేలకు మళ్ళీ తన తర్వాత సినిమాను ఎనౌన్స్ చేశాడు. హిట్లు ప్లాపులు తనకు సంబంధం లేదన్నట్టుగా వర్మ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా వర్మ ఒక హిందీ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఆ చిత్రం పేరు వైరస్’ అని తెలుస్తోంది. వర్మ ‘సర్కార్, అటాక్స్ అఫ్ 26/11’ లాంటి చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత పరాగ్ సంఘ్వి ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు.

ఈ చిత్రంలో నటించే నటీనటులు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్ర కథ ‘ఎబోలా వైరస్’కు సంబంధించిదని తెలుస్తోంది. ఈ ‘ఎబోలా వైరస్’ బారిన పడి గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మరీ వర్మ ఈ చిత్రాన్ని కూడా ప్రకటించి ఊరుకుంటాడో లేక సీన్సియర్ గానే తెరకెక్కిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు