వర్మ వివాదాస్పద సినిమాకి కొత్త రిలీజ్ డేట్ !

వర్మ వివాదాస్పద సినిమాకి కొత్త రిలీజ్ డేట్ !

Published on Dec 7, 2019 10:18 PM IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తాజా తన వివాదాస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కి ఎన్ని అడ్డంకులు వచ్చిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్ మార్చి రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా కులాల్ని పార్టీలను బేస్ చేసుకుని ఉండనున్న ఈ సినిమా పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

కులంతో పాటు రాజకీయ నాయకులను వ్యక్తగతంగా కూడా వర్మ టార్గెట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేనాని అభిమానులు కూడా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైనా సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరును, అలాగే ప్రస్తుత రాజకీయ అంశాలను వర్మ సినిమాగా తీస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు