అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘ఆఫీసర్’. ప్రకటన రోజు నుండే బోలెడు క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా, తండ్రిగా కనిపించనున్నాడు. సాధారణంగానే సినిమాల్ని శరవేగంగా పూర్తిచేసే వర్మ ఈ సినిమాను కూడ చకచకా కానిచ్చేశారు.
తాజాగా ఈ సినిమాలోని లాస్ట్ షాట్ చిత్రీకరణ ముగిసినట్టు వర్మ తెలిపారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కు కూడా మంచి స్పందన దక్కగా చిత్రాన్ని మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపించనుంది.


