
విలక్షణకి, వివాదాలకి నెలవైన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. చెప్పాలంటే ఇన్ని సినిమాలు ఒకేసారి ఎలా చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే వర్మ తీసిన పూర్తి రొమాంటిక్ లవ్ స్టొరీ ‘365 డేస్’ గత శుక్రవారం విడుదలైంది. ఇది రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే వర్మ ‘మొగలి పువ్వు’ అనే సినిమాని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం వర్మ మొగలి పువ్వు సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం పోలాండ్ లోని అందమైన లోకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాడు.
ఇక్కడ విషయం ఏమిటంటే గత 6 ఏళ్ళుగా వర్మ తన సినిమాలన్నిటినీ లోకల్ లోనే తీస్తున్నాడు. అస్సలు అబ్రాడ్ వైపు వెళ్ళలేదు. గతంలో నితిన్ తో చేసిన అడవి సినిమా కోసం వర్మ శ్రీలంక వెళ్ళారు. ఆ తర్వాత మరే సినిమా షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్ళలేదు. వర్మ అన్ని లో బడ్జట్ లో లిమిటెడ్ డేస్ లో షూటింగ్ చేసేస్తుండడం వలన ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్ వెళ్ళడం లేదు. మళ్ళీ ఈ సినిమా కోసం అబ్రాడ్ వెళ్ళాడు. పెళ్ళైన భార్య భర్తల మధ్య ఉండే రిలేషన్ లో వచ్చే ఇబ్బందులను బేస్ చేసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ గా మొగలి పువ్వు సినిమాని షూట్ చేస్తున్నాడు. సచిన్ జోషి, మీరా చోప్రా, జాకీర్ హుస్సేన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలైంది.