జగన్, రాహుల్ పై సెటైర్స్ వేసిన రామ్ గోపాల్ వర్మ

ram-gopal-varma
ఎప్పటికప్పుడు ప్రస్తుత విషయాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ సారి కూడా 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన ఓ రెండు పార్టీ అధినేతలపై కామెంట్స్ చేసారు. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు ఒకరు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అయితే మరొకరు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ వర్మ చేసిన కమెంట్స్ ఏంటో చూద్దాం..

వైఎస్ జగన పై ‘పూర్ వైసీపీ.. వైఎస్ఆర్ సమాధి చుట్టూ తిరగాల్సింది’ అని ట్వీట్ చేసాడు..

రాహుల్ గాంధీ పై ‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆగ్.. కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా గాంధీలు ఉంటే ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే చాన్స్ లేదు’ అన్నాడు.

అలాగే ‘1947లో నెహ్రూ గా పుట్టిన కాంగ్రెస్ పార్టీ 2014 రాహుల్ గా చనిపోయింది. ఈ సందర్భంగా సంతాపం’ తెలియజేస్తున్నానని ట్వీట్ చేసాడు.

వర్మ ప్రస్తుతం మంచు విష్ణుతో చేస్తున్న సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే తను డైరెక్ట్ చేసిన ‘పట్ట పగలు’ సినిమా జూన్ 6న రిలీజ్ కానుంది.

Exit mobile version