ఎన్టీఆర్‌తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు – వర్మ

ఎన్టీఆర్‌తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు – వర్మ

Published on Nov 27, 2014 2:46 PM IST

ram-gopal-varma
‘టెంపర్’లో తారక్ ఫెరఫార్మన్స్ చూసిన తర్వాత తనతో సినిమా చేసే అర్హత నాకు లేదని అర్దమయ్యింది. అని సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమాలో కొన్ని స్టిల్స్ బుధవారం ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఇవి చూసిన అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ‘టెంపర్’ సినిమాను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

‘టెంపర్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూశాను. తారక్ సింపుల్ గా అవుట్ స్టాండింగ్, ఇప్పటి వరకు జగన్ క్రియేట్ చేసిన హీరో క్యారెక్టర్ లలో ఇదే బెస్ట్ అనుకుంటున్నాను. జగన్ చేసిన కమర్షియల్ ఫిల్మ్స్ లో ‘టెంపర్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. సీన్స్, సాంగ్ లు, ఎంటర్టైన్మెంట్ అన్నీ తారక్ లా పీక్స్ లో ఉన్నాయి.

జ’గన్’ అనే తుపాకి నుండి పేలిన ‘టెంపర్’లో తారక్ బుల్లెట్. యాంటి ఎయిర్ క్రాప్ట్ టాంక్ నుంచి విడిచిన మిస్సైల్ కన్నా ఈ బుల్లెట్ చాలా పవర్ ఫుల్. ‘టెంపర్’తో పోలిస్తే మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కిన ‘పోకిరి’ & ‘బిజినెస్ మ్యాన్’లు ఫ్లాఫ్ లు క్రిందే లెక్క. అని వర్మ సోషల్ మీడియాలో ‘టెంపర్’ సినిమాపై, శిష్యుడు పూరి జగన్నాధ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లపై పొగడ్తల వర్షం కురిపించారు.

తాజా వార్తలు