‘సావిత్రి’ నచ్చితే చూడండి లేదా మానేయండి – వర్మ

rgv

వర్మ ఇంటి పేరు వివాదం అయి చాలా రోజులైంది. ఇటివల కాలంలో వర్మ సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతి సినిమాకు ఏదో వివాదం ఉండేలా చూసుకోవడం, ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం వర్మ హాబీగా మారింది. తాజాగా ‘సావిత్రి’ సినిమాతో కొత్త వివాదానికి తెరతీశారు. చిన్న కుర్రాడు టీచర్ అందాలను తొంగి చూస్తూ ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లపై మహిళా సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ బాలల హక్కుల పరిరక్షణ సమితి, వర్మపై సుమోటో కింద కేసును స్వీకరించింది.

ఈ వివాదంపై వర్మ స్పందించిన తీరు యధావిధిగా ఉంది. నాకు నచ్చిన కథను సినిమాగా తెరకేక్కిస్తున్నాను. అది నా ఇష్టం. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. ప్రతి ఒక్కరికి చిన్నతనంలో క్రష్ ఉంటుంది. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పే వాక్ స్వాతంత్ర్యం నాకుంది. అని వర్మ వ్యాఖ్యానించారు.

వర్మకు ఈ తరహా చీత్కారాలు, వివాదాలు కొత్త కాదు. ఆయన వివాదాలను ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఈ మధ్య వర్మ క్రియేటివిటీ హద్దులు మీరుతుందని ఆయన అభిమానులు సైతం ఆరోపిస్తున్నారు.

Exit mobile version