జగన్‌కు లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ షో !

Published on May 29, 2019 1:17 pm IST

ఈ నెల 31న విడుదలకానున్న సినిమాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా ఒకటి. రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా కొన్ని నెలల క్రితమే విడుదలవాల్సి ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక్క ఏపీలో మాత్రమే నిలిచిపోయి మిగతా అన్ని చోట్ల విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి కృషి వలన ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగి ఈ శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా వర్మ నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు తిరుపతికి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ షోకు ఆహ్వానిస్తాను అన్నారు. మరి రేపు ప్రమాణస్వీకారం తర్వాత ఇంకో వారంపాటు వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండనున్న జగన్ వర్మ ఆహ్వానాన్ని మన్నించి సినిమా చూసేందుకు వెళతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More