అప్పుడు మురుగదాస్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ !


సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ మరోసారి తన ట్వీట్లకు పదునుపెట్టారు. ఈసారి ఆయన టార్గెట్ చేసింది నేషనల్ అవార్డ్స్ ను. కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో జ్యూరీ మెంబర్స్ సరిగా లేరని, విజేతల ఎంపికలో అవకతవకలు ఉన్నాయని గతంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడి తగ్గక ముందే ఇప్పుడు వర్మ కూడా వాటిని విమర్శిస్తూ పరోక్షంగా ట్వీట్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది.

వర్మ తన ట్విట్టర్లో ‘నిజమేమిటంటే అమీర్ ఖాన్ ఇండియాలోనే గొప్ప ఫిలిం మేకర్. ఆయన అనేక క్వాలిటీ ఫిలిమ్స్ చేశారు. ఆయన అవార్డ్స్ వేడుకలకు హాజరుకాకపోతే ఆయన స్థాయి తగ్గిపోదు. అయినా ఆయన ప్రతిభకు నేషనల్ అవార్డ్స్ కొలమానాలు కాలేవు’ అంటూ పరోక్షంగా అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాను అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ కనీసం పట్టించుకోకపోవడంపై తన అసహనాన్ని వ్యక్తపరిచారు.

Exit mobile version