విభిన్న తరహా చిత్రాలకు మరియు వివాదాస్పద వ్యాఖ్యలకు నెలవైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. గత కొద్ది రోజులుగా కాస్త సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ తాజాగా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసాడు. అది కూడా శంకర్ డైరెక్ట్ చేసిన ‘ఐ’ సినిమా గురించి కావడం విశేషం. మొదట ‘ఒక కామన్ మాన్ లా ఐ ట్రైలర్ చూసాక తమిళనాడులో జయలలిత, రజినీకాంత్ ల కంటే శంకర్ పెద్దవాడని అర్థమైందని’ అన్నాడు.
అలా అన్న మరుసరోజే ‘శంకర్ ఐ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోందని విన్నాను. అలా గనుక ఐ వస్తే పికె పరస్థితి ఏమిటి అని’ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ఇది చూసిన చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ ని అన్నాడని చాలా ఆవేశానికి లోనవ్వడమే కాకుండా వర్మపై రివర్స్ ట్వీట్ల వర్షం కురిపించారు. కానీ వారందరికీ వర్మ రిప్లై ఇస్తూ ‘చాలా మంది నేను పికె అని చెప్పింది పవన్ కళ్యాణ్ ని అనుకుంటున్నారు, కానీ నేను చెప్పింది అమీర్ ఖాన్ నటించిన పికె సినిమా గురించి, నా ప్రకారం ఐ రిలీజ్ అయితే పికె ఎక్కువ రోజులు రన్ అవ్వదని’ అన్నాడు. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.


