వర్మ సెన్సేషనల్ సినిమాకు ఇరవై ఏళ్ళు..!

వర్మ సెన్సేషనల్ సినిమాకు ఇరవై ఏళ్ళు..!

Published on Sep 9, 2015 9:47 PM IST

Ram-Gopal-Varma
రంగీలా.. అమీర్ ఖాన్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన బాలీవుడ్ క్లాసిక్. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రహమాన్‌ను బాలీవుడ్‍కు పరిచయం చేసిన ఈ సినిమా విడుదలై నేటికి ఇరవై ఏళ్ళు. అమీర్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ, ఏ.ఆర్.రహమాన్.. ఈ ముగ్గురు దిగ్గజాలకూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టడమే కాక స్టార్స్‌ను చేసింది. ఈ సినిమాతో వర్మ, బాలీవుడ్‌ మార్కెట్‌కు ఓ సరికొత్త దారిని చూపించారు. ఈ సినిమా తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ, దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా చేరిపోయారు.

రామ్ గోపాల్ వర్మ స్టైల్ టేకింగ్‌కు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. మున్నాగా ఆమీర్ ఖాన్‌ను వర్మ సరికొత్తగా ప్రెజెంట్ చేశారు. రహమాన్ అందించిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు అప్పట్లో సెన్సేషన్‌గా నిలిచాయి. ఇన్ని ప్రత్యేకతలతో ఇప్పటికీ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ‘రంగీలా’ సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న రోజున సోషల్ మీడియాలో ‘రంగీలా’ ముచ్చట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు