వైరల్ పిక్: మోహన్ లాల్ తో రిషబ్ శెట్టి!

వైరల్ పిక్: మోహన్ లాల్ తో రిషబ్ శెట్టి!

Published on Apr 18, 2024 7:41 PM IST

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను తాజాగా కాంతార ఫేమ్ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిషబ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. తమ ఇద్దరు అభిమాన హీరోలు ఒకే ఫ్రేమ్ లో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు.

మోహన్ లాల్ చివరిసారిగా మలైకొట్టాయి వాలిబన్ లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. రిష్బ్ శెట్టి కాంతార చిత్రం ప్రీక్వెల్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు