నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ఎంపికైనట్లు సమాచారం. గతంలో ‘ఎవడేసుబ్రమణ్యం’ మూవీలో నానితో రీతూవర్మ నటించడం జరిగింది. పెళ్లి చూపులు చిత్రం తరువాత తెలుగులో 2017లో వచ్చిన కేశవ చిత్రంలో ఆమె నటించారు. నాని చిత్రంలో అవకాశం దక్కించుకొని మరో మారు లక్కి గర్ల్ అని నిరూపించుకుంది.
ఇక నాని, శివనిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా రావడంతో అంచనాలు బాగున్నాయి.శివ నిర్వాణ ఈ ఏడాది ‘మజిలీ’ చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్నారు. డిసెంబర్ నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభించి జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.


