థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్ తో అలరిస్తోన్న రితికా సింగ్ ‘వళరి’ ట్రైలర్

థ్రిల్లింగ్, హర్రర్ ఎలిమెంట్స్ తో అలరిస్తోన్న రితికా సింగ్ ‘వళరి’ ట్రైలర్

Published on Mar 1, 2024 2:15 AM IST

యువ నటి రితికా సింగ్, నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో మ్రితికా సంతోషిణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ మూవీ వళరి. ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని నేడు హైదరాబాద్ లో ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.

ఇక ట్రైలర్ లో ముఖ్యంగా థ్రిల్లింగ్, హర్రర్ సన్నివేశాలు ఎంతో అలరించాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ తో పాటు ఆకట్టుకునే సీన్స్ సినిమా చూడాలనే ఆసక్తిని అందరిలో ఏర్పరుస్తాయి. ప్రస్తుతం వళరి ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. ఇంకా ఈ మూవీలో సుబ్బరాజు, ప్రిన్సెస్ సహారా, ఫర్నిత రుద్రరాజు కీలక పాత్రలు చేస్తుండగా కె. సత్య సాయి బాబు ఎగ్జిగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈటివి విన్ ద్వారా మార్చి 8 నుండి అందుబాటులోకి రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు