“స్వాగ్” కి డబ్బింగ్ షురూ చేసిన రీతూ వర్మ!

“స్వాగ్” కి డబ్బింగ్ షురూ చేసిన రీతూ వర్మ!

Published on Apr 29, 2024 6:24 PM IST

దాదాపు 3 సంవత్సరాల క్రితం తెలుగులో చివరిసారిగా ఒకే ఒక జీవితం అనే చిత్రంలో కనిపించిన రీతూ వర్మ తన తదుపరి విడుదల స్వాగ్ కోసం సిద్ధమవుతోంది. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె శ్రీవిష్ణుతో కలిసి నటించింది. స్వాగ్ కి సంబందించిన టైటిల్ ప్రకటన వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.

తాజా సమాచారం ఏమిటంటే, రీతూ వర్మ ప్రస్తుతం ఈ సినిమాలో తన పాత్ర అయిన రుక్మిణి దేవికి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వార్తను పంచుకుంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న స్వాగ్ త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు