షాదీ ముబారక్ అంటున్న ఆర్కే నాయుడు

Published on Dec 18, 2020 5:03 pm IST

టీవీ సీరియల్స్ చాలానే ఉంటాయి కానీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేవి మాత్రం కొన్నే. అలాంటి సీరియల్స్ లిస్టు తీస్తే అందులో చక్రవాకం, మొగలి రేకులు తప్పని సరిగా ఉంటాయి. సీరియల్ యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు కానీ స్టార్ డమ్ సాధించిన నటులు మాత్రం కొందరే.

పైన చెప్పుకున్న రెండు సీరియల్స్ లో నటించి భారీ ప్రేక్షకాదరణ సాధించిన నటుడు సాగర్. ముఖ్యంగా ‘మొగలి రేకులు’ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ ఆర్. కె నాయుడు పాత్ర బుల్లితెర ప్రేక్షకులకులను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ సాగర్ పేరు కంటే ఆర్ కె నాయుడు పేరే ఆడియన్స్ లో ఎక్కువగా పాపులర్. అప్పట్లోనే సినిమా హీరో కావలసిన లక్షణాలన్నీ సాగర్ లో ఉన్నాయని ప్రేక్షకులు అనుకున్నారు. పైగా టీవీలో క్రేజ్ ఉన్న నటులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడం కామనే. సాగర్ కూడా ‘సిద్దార్థ’ సినిమా ద్వారా వెండితెరపై లక్ టెస్ట్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. కొంత గ్యాప్ తర్వాత సాగర్ ‘షాదీ ముబారక్’ అనే ఒక రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం ఒక విశేషం. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రజెంట్ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

ఈ సినిమాలో సాగర్ కు జోడీగా దృశ్య రఘునాథ్ నటించింది. ఈ సినిమాతో పద్మశ్రీ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. మరి బుల్లితెర ఆర్ కె నాయుడు వెండితెరపై తన సత్తా చాటుతాడా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :