హిందీలో “టైగర్ నాగేశ్వరరావు” కి రోరింగ్ రెస్పాన్స్.!

హిందీలో “టైగర్ నాగేశ్వరరావు” కి రోరింగ్ రెస్పాన్స్.!

Published on Apr 21, 2024 11:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో తన మొదటి పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. డెబ్యూ దర్శకుడు వంశీతో చేసిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో డీసెంట్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా గత కొన్నాళ్ల కితమే ఓటిటి సహా యూట్యూబ్ లో కూడా హిందీ వెర్షన్ లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాకి యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ నమోదు అయ్యింది.

రిలీజ్ అయ్యిన కొన్ని రోజుల్లోనే మిలియన్స్ కొద్దీ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు భారీ మొత్తంలో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి సెన్సేషన్ ని సెట్ చేసింది. దీనితో మరోసారి రవితేజ సినిమాల పట్ల నార్త్ ఆడియెన్స్ ఏ రేంజ్ ఆదరణ అందిస్తారో అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించగా గాయత్రీ భరద్వాజ్ మరో ముఖ్య పాత్రలో నటించింది. అలాగే జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు