‘రాబిన్ హుడ్’ : ఆకట్టుకుంటున్న నితిన్ బర్త్ డే స్పెషల్ టీజర్

‘రాబిన్ హుడ్’ : ఆకట్టుకుంటున్న నితిన్ బర్త్ డే స్పెషల్ టీజర్

Published on Mar 31, 2024 12:30 AM IST

యువ నటుడు నితిన్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో వేణు శ్రీరామ్ తీస్తున్న తమ్ముడు మూవీ ఒకటి కాగా వెంకీ కుడుముల తీస్తున్న రాబిన్ హుడ్ మరొకటి. ఇక యాక్షన్ అడ్వెంచర్ గా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ తో ఆకట్టుకుని అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రాబిన్ హుడ్ నుండి నేడు నితిన్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అలరించే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు నితిన్ పవర్ఫుల్ ఎంట్రీ తో రూపొందిన ఈ స్పెషల్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో కొనసాగుతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలో రాబిన్ హుడ్ కి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వరుసగా రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు